స్విట్టజర్లాండ్‌లో చిరు ఏమిచేస్తున్నాడబ్బా...

స్విట్టజర్లాండ్‌లో చిరు ఏమిచేస్తున్నాడబ్బా...

మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్  మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ పయనమయ్యారు. చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరించారు. ఈ పాటకు సంబధించిన విశేషాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తెలియజేశారు. ''స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song  Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ  పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు లీక్స్' పిక్స్ ''అంటూ లొకేషన్ స్టిల్స్ ని షేర్ చేశారు.

మెగాస్టార్ మహతి స్వర సాగర్ ఈ పాట కోసం రాకింగ్ నెంబర్ ని స్కోర్ చేశారు. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ & యాక్షన్‌ సమపాళ్లలో వుండనున్నాయి. తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్,  చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ పాత్రలో నటిస్తున్నాడు.